![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -352 లో.. స్వప్నని కావ్య రూమ్ లోకి తీసుకొని వచ్చి.. నువ్వు మోడలింగ్ చెయ్యడం ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదని చెప్పారు కదా మరి నువ్వేంటి ఇలా చేస్తున్నావని కావ్య అడుగుతుంది. నా భర్త అత్తలకి బుద్ది చెప్పాలని ఇలా చేశాను.. ఇలా ఉంటేనే నడుస్తుంది. నీలా ఉంటే చూసావ్ కదా ఆ అనామిక కూడా నిన్ను ఆడుకుంటుందని స్వప్న అంటుంది.
ఆ తర్వాత ఇందిరాదేవి, సీతారామయ్య ఇద్దరు కలిసి స్వప్న గురించి మాట్లాడుకుంటారు. స్వప్న మాట్లాడిన దాంట్లో న్యాయం ఉందని దానికి పరిష్కారం వెతకాలని ఇద్దరు అనుకుంటారు. అలాగే సుభాష్ తో ధాన్యలక్ష్మి మాట్లాడిన తీరు గుర్తుకు చేసుకుంటారు. ఆ తర్వాత అనామిక గదిలోకి వస్తుంటే.. కళ్యాణ్ బయటకు వెళ్తుంటాడు. ఎందుకు వెళ్తున్నావని అనామిక అడుగుతుంది. నాకు ప్రశాంతంగా ఉండాలని ఉంది. అందుకే హాల్లో పడుకుంటానని కళ్యాణ్ అంటాడు. ఇప్పుడు మనం గొడవ పడుతున్నామని ఇంట్లో అందరికి తెలియాలా అని అనామిక అనగానే.. వాళ్ళకి తెలియదని అనుకుంటున్నావా? నువు నన్ను అర్థం చేసుకుంటావన్న ఆశ ఉందని కళ్యాణ్ వెళ్తాడు. ఎప్పటికైన నువు దారిలోకే వస్తావని అనామిక అనుకుంటుంది. ఆ తర్వాత బయట హాల్లో పడుకున్న కళ్యాణ్ ని ధాన్యలక్ష్మి చూసి.. ఏంటి వాళ్ళు గొడవ పడ్డారా అని వెళ్లి ప్రకాష్ ని నిద్ర లేపి కళ్యాణ్ హాల్లో పడుకున్నాడని చెప్తుంది. మీరు వెళ్లి ఏం జరిగిందో కనుకొని సర్ది చెప్పి గదిలోకి పంపించండని చెప్తుంది. దాంతో ప్రకాష్ వచ్చి మాట్లాడుతాడు. మీరు బాధపడుతారని మాత్రమే వెళ్తున్నానని కళ్యాణ్ లోపలికి వెళ్తాడు.. ఆ తర్వాత ధాన్యలక్ష్మి వస్తుంది. నువు అనామికకి సపోర్ట్ చెయ్యడం వల్లే తను అలా తయారైంది.. భర్తతో ఎలా ప్రేమగా ఉండాలో నేర్పించని ధాన్యలక్ష్మితో ప్రకాష్ చెప్తాడు.
ఆ తర్వాత రాజ్ శ్వేతతో కావ్య వాళ్ళ బావని వాళ్ళ ఇంట్లోనే వదిలేసి వచ్చానంటూ హ్యాపీగా చెప్తాడు. అప్పుడే కావ్య వస్తుంది. మీ బావ అక్కడ ఉన్నాడని ఫీల్ అవుతున్నావా అంటూ రాజ్ వెటకారంగా మాట్లాడతాడు. కావ్య వెళ్లిపోతుంది. ఆ తర్వాత కావ్య దగ్గరికి ఇందిరాదేవి వచ్చి మళ్ళీ మీ బావని ఇక్కడికి రప్పించు అని చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |